News July 15, 2024
నన్ను కలిస్తే సంబంధం అంటగడతారా?: విజయసాయి రెడ్డి

AP: తన వ్యక్తిత్వంపై కుట్రపూరితంగానే అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని YCP MP విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ‘ఓ ఆదివాసీ మహిళను బజారుకీడ్చారు. ఎంపీనైన నన్ను ఎంతోమంది కలుస్తారు. అంతమాత్రాన <<13630730>>సంబంధం<<>> అంటగడతారా? తారతమ్యాలు లేవా? సాయిరెడ్డి తండ్రిలాంటి వ్యక్తి అని ఆమెనే చెప్పింది. ఆరోపణలు చేసినవారిపై కేసులు పెడతా. త్వరలోనే ఛానల్ ప్రారంభించి వారి కుట్రలను ఎండగడతా’ అని తెలిపారు.
Similar News
News December 26, 2025
పాక్‌కు ఉగ్ర సంస్థ సవాలు.. ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటన

పాకిస్థాన్‌కు ఉగ్ర సంస్థ TTP(తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్) తలనొప్పిగా మారింది. 2026లో తాము ఎయిర్ ఫోర్స్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని సంచలన ప్రకటన చేసింది. మిలిటరీ యూనిట్లు, ప్రావిన్స్‌లలో మోహరింపుల గురించి వెల్లడించింది. మిలిటరీ కమాండర్లతో 2 పర్యవేక్షణ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కాగా పాక్ సైన్యంపై TTP టెర్రరిస్టులు పలు దాడులు చేశారు. అఫ్గాన్ నుంచి TTP ఆపరేట్ అవుతోందని పాక్ ఆరోపిస్తోంది.
News December 26, 2025
మానసిక సంతృప్తే నిజమైన సంతోషం: మోహన్ భాగవత్

AP: మనిషికి నిజమైన సంతోషం మానసిక సంతృప్తిలోనే ఉందని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మనిషికి సుఖదుఃఖాలు తాత్కాలికమని, ఎంత సంపాదించినా మనసుకు తృప్తి లేకపోతే ఆనందం ఉండదని అభిప్రాయపడ్డారు. క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు. సరైన మార్గంలో పయనిస్తే లక్ష్యం తప్పక చేరుతామని స్వామి వివేకానంద నిరూపించారన్నారు.
News December 26, 2025
ఆ ధీరుడిని TDP గూండాలు హతమార్చి..: అంబటి ట్వీట్

AP: దివంగత కాపు ఉద్యమనేత వంగవీటి మోహన రంగాకు మాజీ మంత్రి, YCP నేత అంబటి రాంబాబు నివాళులు అర్పించారు. ఈమేరకు ట్వీట్ చేస్తూ తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. ‘దీక్షలో ఉన్న ధీరుడిని టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 37 సంవత్సరాలు. “జోహార్ వంగవీటి మోహన రంగా”!’ అని Xలో పొందుపరిచారు. మరోవైపు వైసీపీ నేతలు పలువురు రంగాకు నివాళులు అర్పించారు.


