News July 15, 2024

అసత్య ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా: విజయసాయిరెడ్డి

image

AP: తనకు అక్రమ సంబంధం <<13632336>>అంటగట్టి<<>> అసత్య ప్రచారం చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రామోజీరావునే ఎదుర్కొన్నానని, ఇప్పుడు ఈ కుట్ర వెనుక ఉన్నవాళ్లకూ బుద్ధి చెబుతానని హెచ్చరించారు. పరువు నష్టం దావా వేయడంతోపాటు పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని తెలిపారు. ఓ వర్గం మీడియా దుష్ప్రచారాలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతానని చెప్పారు.

Similar News

News January 21, 2025

ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

image

తెలంగాణలో ఇంటర్ కాలేజీల్లో <<15028933>>మధ్యాహ్న భోజన పథకం<<>> అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. CM రేవంత్ సూచనలతో ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అంగీకారం తెలిపితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించనుంది. రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 425 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, సుమారుగా 1.75 లక్షల మంది చదువుతున్నారు.

News January 21, 2025

క్రైమ్‌సీన్ రీక్రియేషన్.. సైఫ్ ఇంటికి నిందితుడిని తీసుకొచ్చిన పోలీసులు

image

యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడు మహ్మద్ షరీఫుల్‌ను అతడి ఇంటి వద్దకు తీసుకొచ్చారు. క్రైమ్ సీక్వెన్స్‌లో భాగంగా అంతకు ముందే నేషనల్ కాలేజ్ బస్టాప్, బాంద్రా రైల్వే స్టేషన్ సహా మరికొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఆదివారం పోలీసులు అతడిని థానేలో అరెస్టు చేశారు. సైఫ్‌ను అతడు ఆరుసార్లు కత్తితో పొడవడం తెలిసిందే.

News January 21, 2025

Stock Markets: రేంజుబౌండ్లో కొనసాగొచ్చు..

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు రేంజుబౌండ్లో చలించొచ్చు. సూచీలు ఊగిసలాడే అవకాశం కనిపిస్తోంది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. ఆరంభంలో లాభపడిన గిఫ్ట్ నిఫ్టీ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. డాలర్ ఇండెక్స్, ట్రెజరీ యీల్డులు బలపడ్డాయి. క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. USDINR బలహీనత కొనసాగుతోంది. బంగారం ధర పెరిగింది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.