News July 15, 2024
దానం నాగేందర్ KCR కాళ్లు మొక్కేవారు: MLA వివేకానంద

TG: KCRపై కాంగ్రెస్ MLA దానం నాగేందర్ విషం కక్కడం ఆశ్చర్యంగా ఉందని కుత్బుల్లాపూర్ BRS MLA <<13632893>>కేపీ.వివేకానంద<<>> అన్నారు. ‘దానం BRSలో ఉన్నప్పుడు KCRను కలిసినప్పుడల్లా ఆయన కాళ్లు మొక్కేవారు. దానం తీరును చూసి మేము కూడా నేర్చుకోవాలనుకున్నాం. HYDలో KCRకు ఉన్న చిన్న ఇల్లు సరిపోదన్నప్పుడు తన ఇంట్లో ఉండమని, తనను మీ కొడుకు అనుకోమని దానం అనేవారు’ అని KP వ్యాఖ్యానించారు.
Similar News
News January 12, 2026
పనసలో కాయకుళ్లు తెగులు నివారణ ఎలా?

పనసలో కాయకుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజిం 1 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రాముల చొప్పున కలిపి పిందె సమయంలో పిచికారీ చేయాలి. మళ్లీ కాయ పెరుగుదల సమయంలో 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చెట్టు చుట్టూ రాలిన ఆకులు, కుళ్లిన భాగాలను తొలగించి శుభ్రంగా ఉంచాలి. చెట్టుకు సరైన గాలి ప్రసరణ ఉండేలా కొమ్మలను కత్తిరించాలి. సరైన పోషకాలు, నీటి యాజమాన్యం పాటించాలి.
News January 12, 2026
ఇంటి క్లీనింగ్ చిట్కాలు

* వెనిగర్, మొక్కజొన్న పిండి, నీరు కలిపి కార్పెట్ల మీద చల్లి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేస్తే సరిపోతుంది.
* కాఫీపొడి, పుదీనా ఆకులు, బేకింగ్ సోడా, నిమ్మతొక్కలు గిన్నెలో వేసి మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.
* కిచెన్‌లో గట్టు, టైల్స్, కిటికీ అద్దాలు శుభ్రం చేయడానికి వెనిగర్, బేకింగ్ సోడా, నీరు కలిపాలి. ఈ మిశ్రమాన్ని చల్లి అరగంటాగి శుభ్రం చేస్తే సరిపోతుంది.
News January 12, 2026
ఈ OTTలోనే ‘మన శంకరవరప్రసాద్ గారు’ స్ట్రీమింగ్!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నిన్న ప్రీమియర్స్‌తో రిలీజైన ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ‘ZEE5’ దక్కించుకోగా శాటిలైట్ హక్కులను ‘జీ తెలుగు’ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే ఇది OTTలో స్ట్రీమింగ్ కానుంది. అనంతరం బుల్లితెరపై సందడి చేయనుంది. మీరూ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.


