News July 15, 2024
నిర్మల్: ప్రతి హాస్టల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి: కలెక్టర్

వసతి గృహ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాల రిపోర్టులను సమర్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. వర్షాకాల నేపథ్యంలో ప్రతి హాస్టల్లో వైద్య శిబిరాలు నిర్వహించి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు చికిత్సలు చేసి, అవసరమైన మందులను అందించాలని అన్నారు. వసతి గృహలలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక విశ్రాంతి హాలును ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: ADB DSP

ఆదిలాబాద్ మున్సిపల్ ఫలితాల వేళ డీఎస్పీ జీవన్ రెడ్డి ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, టపాకాయలు పేల్చడం నిషేధమని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రం, ప్రధాన చౌరస్తాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ప్రజలు గుమిగూడరాదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని, పోలీసులకు సహకరించాలని కోరారు.
News February 13, 2026
ఆదిలాబాద్‌లో తొలి విజయం మహిళదే

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మొదటి ఫలితం వెలువడింది. 48 వార్డులో బీజేపీ అభ్యర్థి ఆకుల రేణుక ప్రవీణ్ విజయం సాధించారు. తమ సమీప ఏఐఎఫ్‌బీ పార్టీ అభ్యర్థి రంగినేని మనీషాపై 34 ఓట్లతో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగింది. మిగిలిన వార్డుల్లో ఫలితాలు వెలువడాల్సి ఉన్న నేపథ్యంలో ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణం నెలకొంది.
News February 13, 2026
ఆదిలాబాద్: ఈనెల 14న స్విమ్మింగ్ పోటీలు

ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఈనెల 14వన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జక్కుల శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్ వద్ద ముమ్మరంగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారుల వయసు ఆధారంగా గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు విభాగాల వారీగా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పాల్గొనే వారు 9494945402 నంబర్‌కు సంప్రదించాలన్నారు.


