News July 15, 2024

40,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు: TCS

image

ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని <<13630881>>TCS<<>> ప్రకటించింది. APR1-JUN30 మధ్య నియమించుకున్న 5,452 మంది కంపెనీ వృద్ధిలో కీలకపాత్ర పోషించారంది. ఉద్యోగులకు 4.5%-7% ఇంక్రిమెంట్ ఇచ్చామని, మరింత మెరుగ్గా పని చేసినవారు 10%-12% అందుకున్నట్లు వివరించింది. కొత్త టాలెంట్‌కు భారత్ గమ్యస్థానంగా ఉందని, సమీప భవిష్యత్తులో ఇది మారదని పేర్కొంది.

Similar News

News January 21, 2025

ఈ వారమే హిందీలో ’డాకు‘ రిలీజ్

image

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ హిందీ వెర్షన్ ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. ఎమోషన్, సహజత్వం కొనసాగేలా ఇందులో కూడా తన రోల్‌కు బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బీటౌన్‌లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

News January 21, 2025

లబ్ధిదారుల లిస్టులో మీ పేరు లేదా? ఇలా చేయండి!

image

TG: ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటి అమలు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి జరుగుతుందని చెప్పారు. నేటి నుంచి గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, అర్హత ఉండి లిస్టులో పేరు లేని వారు గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు ఇవ్వాలని సూచించారు.

News January 21, 2025

WEF: నేడు ఈ సంస్థలతో సీఎం రేవంత్ చర్చలు

image

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రెండో రోజున CM రేవంత్ పలు కంపెనీలతో పెట్టుబడులపై చర్చించనున్నారు. అమెజాన్, యుని లివర్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. IT, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.