News July 15, 2024
‘ZOMATO’లో ఈ ఫీచర్ ఎందుకొచ్చిందంటే?
ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో’లో కొత్తగా ‘డిలీట్’ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, దీన్ని తీసుకురావడానికి గల కారణాన్ని సంస్థ CEO దీపిందర్ గోయల్ తెలిపారు. ఆర్డర్స్ హిస్టరీ వల్ల లేట్ నైట్ బుక్ చేసుకుని తింటున్నట్లు తన భార్య తెలుసుకుంటోందని, డిలీట్ చేసే ఆప్షన్ ఉంటే బాగుండేదని ఓ నెటిజన్ ట్విటర్లో CEOకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారని దీన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
Similar News
News January 21, 2025
లబ్ధిదారుల లిస్టులో మీ పేరు లేదా? ఇలా చేయండి!
TG: ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటి అమలు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి జరుగుతుందని చెప్పారు. నేటి నుంచి గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, అర్హత ఉండి లిస్టులో పేరు లేని వారు గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు ఇవ్వాలని సూచించారు.
News January 21, 2025
WEF: నేడు ఈ సంస్థలతో సీఎం రేవంత్ చర్చలు
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రెండో రోజున CM రేవంత్ పలు కంపెనీలతో పెట్టుబడులపై చర్చించనున్నారు. అమెజాన్, యుని లివర్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. IT, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
News January 21, 2025
పలువురు మావోయిస్టు కీలక నేతలు మృతి?
ఛత్తీస్గఢ్లో జరిగిన <<15211460>>ఎన్కౌంటర్లో <<>>14 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నట్లు సమాచారం. చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చిత్తూరు వాసి కాగా, ఆయనపై గతంలోనే రూ.కోటి రివార్డు ప్రకటించారు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో రెండ్రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.