News July 16, 2024
రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికంపై మంత్రి ఏమన్నారంటే?
TG: 2018లో రుణమాఫీకి గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలనే తామూ అమలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ‘రుణమాఫీకి రేషన్ కార్డు రూల్ కేవలం కుటుంబాన్ని నిర్ధారించడానికే. కుటుంబ నిర్ధారణ కాగానే మిగతా వారికి కూడా రుణమాఫీ వర్తింపజేస్తాం. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏకకాలంలో రూ.2లక్షలు మాఫీ చేస్తున్నాం. అయినా ప్రతిపక్షాలు బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని మంత్రి మండిపడ్డారు.
Similar News
News January 21, 2025
రంజీ ఆడనున్న రోహిత్.. MCA కీలక నిర్ణయం
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు పదేళ్ల తర్వాత రంజీల్లో ఆడుతున్నారు. దీంతో MCA (ముంబై క్రికెట్ అసోసియేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై-జమ్మూకశ్మీర్ మ్యాచ్ జరిగే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మైదానంలో సీట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. హిట్‌మ్యాన్ ఆటను చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తారని, ఇందుకు తగినట్లుగా సీట్లు ఏర్పాటు చేయాలని భావించింది.
News January 21, 2025
ట్రంప్ గారూ.. మరోసారి ఆలోచించండి: WHO
WHO నుంచి <<15210852>>తప్పుకుంటున్నట్లు<<>> ట్రంప్ ప్రకటించడంపై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మంది ఆరోగ్యం కోసం WHO, USA కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 1.4 బిలియన్ల జనాభా ఉన్న చైనా WHOకు 39 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంటే తాము 500 మి.డా. చెల్లిస్తున్నామని ట్రంప్ అంతకుముందు చెప్పారు.
News January 21, 2025
IT దాడులపై స్పందించిన దిల్ రాజు భార్య
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేస్తోంది. దీనిపై ఆయన భార్య తేజస్విని స్పందించారు. ‘సినిమా నిర్మాణాలకు సంబంధించే మా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇంట్లో ఉన్న పలు రికార్డులు పరిశీలించారు. ఐటీ అధికారులకు బ్యాంకు వివరాలు ఇచ్చాం. బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసి చూపించాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.