News July 16, 2024

ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం

image

ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జేఏండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో విడుదలైన ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది. జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకుందామని లేఖలో పేర్కొన్నారు. ప్రజలపై కొనసాగుతున్న విప్లవ ప్రతిఘాతుక కుమార్ ఆపరేషన్‌ను ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దామన్నారు. మావోయిస్టులపై నిషేధ ఆజ్ఞలు విధించడం తగదన్నారు.

Similar News

News August 5, 2025

వరంగల్ జిల్లాలో వర్షపాతం ఇలా..!

image

వరంగల్ జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాలోని 13 మండలాల్లో వర్షపాతం 3.3 మి.మీ. నమోదైనట్లు తెలిపింది. జిల్లా మొత్తంలో వర్ధన్నపేట 35.2 మి.మీ. అధిక వర్షపాతం ఉన్నట్లు పేర్కొంది. రాయపర్తి మండలంలో స్వల్పంగా వర్షం కురువగా మిగతా మండలాల్లో వర్షం లేదని ప్రకటించారు.

News August 5, 2025

వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు ఎన్నికల షెడ్యూల్‌ను జిల్లా సహకార అధికారి వాల్య నాయక్ సోమవారం విడుదల చేశారు. ఈనెల 21న ఏవీవీ కళాశాలలో ఉ.8 నుంచి మ.2 వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వరంగల్ కాశీబుగ్గలోని అర్బన్ బ్యాంకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో 8, 11, 12వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 12న స్క్రూటినీ చేసి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 14న విత్ డ్రా అనంతరం తుది జాబితా ఉంటుంది.

News August 4, 2025

వరంగల్: వనమహోత్సవ లక్ష్యసాధనకు కృషి చేయాలి: కలెక్టర్

image

వన మహోత్సవ లక్ష్య సాధనకు అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. వన మహోత్సవంపై సోమవారం శాఖల సమీక్ష నిర్వహించారు. 2025-26లో జిల్లాలో 31 లక్షల 4 వేల 272 మొక్కలు నాటే లక్ష్యానికి భాగంగా ఇప్పటివరకు 10.87 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. వాటిలో 9.08 లక్షల మొక్కలకు జియో ట్యాగింగ్ చేయగా, 5.61 లక్షల మొక్కలు ఇంటింటికి పంపిణీ చేశారు.