News July 16, 2024
కరీంనగర్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు!

KNR వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కానున్నాయి. ఇందుకు ఒకే చోట నాలుగేళ్లు పూర్తైన వారు DPO ఆఫీస్‌లో దరఖాస్తులు అందజేశారు. ఈనెల 11 సా. వరకు ఆప్షన్ల గడువు ముగిసింది. జిల్లాలో 318 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న కార్యదర్శుల 185 మంది ఉన్నారు. ఈనెల 20 వరకు 88 మందికి బదిలీలకు అవకాశం ఉంది. పైరవీలకు తావు లేకుండా స్థానచలనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News January 5, 2026
కరీంనగర్: ఓటర్ల జాబితాలో ‘గందరగోళం’

కరీంనగర్ నగరపాలక సంస్థ ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయారైంది. వార్డుల వారీగా కాకుండా పాత బూత్‌ల ప్రకారమే జాబితాను రూపొందించారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఒక డివిజన్ ఓటర్లు మరోచోట చేరారు. వెదురుగట్ట గ్రామ ఓటర్లు తీగలగుట్టపల్లి జాబితాలో ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ తప్పిదాలపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోంది. అధికారులు ఎప్పుడు సరిచేస్తారో వేచి చూడాలి.
News January 4, 2026
KNR: ప్రత్యేక బస్సు కోసం మంత్రికి వినతి

కరీంనగర్‌లోని ప్రధాన విద్యాసంస్థలు, పర్యాటక ప్రాంతాలైన ఉజ్వల పార్క్, పాలిటెక్నిక్, శాతవాహన ఫార్మసీ కళాశాల మార్గంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సును నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ కోరారు. విద్యార్థులు, ఉద్యోగుల రవాణా ఇబ్బందులపై ఆయన వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి, తక్షణమే ఈ రూట్‌లో బస్సు సర్వీసును పరిశీలించి ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News January 4, 2026
KNR: డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ, ఉచిత వైద్య శిబిరం

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం KNR జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో 200 మంది డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డీటీసీ పి.పురుషోత్తం మాట్లాడుతూ.. ఆరోగ్యవంతులైన డ్రైవర్లతోనే సురక్షిత ప్రయాణం సాధ్యమన్నారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన వారికి సీపీఆర్ ద్వారా ప్రాణదానం చేయవచ్చని డాక్టర్ ప్రణవ్ వివరించారు. శిబిరంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు, జనరల్ చెకప్ నిర్వహించారు.


