News July 16, 2024
అనంత: పీర్ల స్వామి అగ్నిగుండంలో వెలుగుతున్న నిప్పు

కుందిర్పి మండలం ఎనుములదొడ్డి పంచాయతీకి చెందిన రుద్రంపల్లిలో పీర్ల స్వామి అగ్నిగుండంలో వింత ఘటన చోటుచేసుకుంది. కట్టెలు కాలిన తర్వాత నిప్పుపై మట్టిని వేస్తే ఆరిపోతుంది. గతేడాది మట్టితో కప్పి వేసిన పీర్ల స్వామి అగ్ని గుండాన్ని సోమవారం తవ్వారు. అయితే ఇప్పటికీ అగ్గి వెలుగుతూ ప్రజలను ఆశ్చర్యపరిచింది. దేవుడి మహిమ అంటూ ప్రజలు ప్రార్థనలు నిర్వహించారు.
Similar News
News August 31, 2025
ATP: గణేష్ నిమజ్జనాలపై కలెక్టర్ ప్రకటన

అనంతపురంలో ఆదివారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు, యువత సహకరించాలని కోరారు. ఆనందంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. శోభాయాత్ర, నిమజ్జనం నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేయమని ఎస్పీని కోరారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వినియోగించాలన్నారు.
News August 30, 2025
పెన్షన్లు, అభివృద్ధి అంశాలపై కలెక్టర్ కాన్ఫరెన్స్

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో పెన్షన్లు, ఇతర అభివృద్ధి అంశాలపై కలెక్టర్ డా.వినోద్ కుమార్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ల పునఃపరిశీలన సమయంలో 9,601 అనర్హమైన పింఛన్లుగా గుర్తించామన్నారు. వాటిలో 7,399 మందిని అర్హులుగా గుర్తించి సెప్టెంబర్ 1న పెన్షన్ అందిస్తామన్నారు. ఇప్పటి వరకు అప్పీల్ చేసుకొని 2,202 మంది సంబంధిత ఎంపీడీఓ/మునిసిపల్ కార్యాలయంలో అప్పీల్ చేసుకోవచ్చన్నారు.
News August 30, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా మలేరియా అధికారి

పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామంలో అనంతపురం జిల్లా మలేరియా అధికారి ఓబులు శనివారం పర్యటించారు. ఇటీవల ఓ విద్యార్థికి డెంగీ వ్యాధి లక్షణాలు నిర్ధారణ కావడంతో అతని గృహాన్ని సందర్శించి, వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీనివాసులు ఉన్నారు.