News July 16, 2024
భోగాపురం భూములపై సీఎం రియాక్షన్

భోగాపురం మండలంలో అసైన్డ్ భూములపై సీఎం చంద్రబాబు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం భూముల రీసర్వే పేరిట భూములను దోచుకున్నారని మండిపడ్డారు. మాజీ సీఎస్ జవహార్‌రెడ్డి భోగాపురం మండలంలోని అసైన్డ్ భూములను బినామీల పేర్లతో దోచుకున్నారు కదా అని పలువురు విలేకర్లు సీఎంను ప్రశ్నించారు. దీనికి స్పందించి ఉన్నత స్థాయిలో విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనికి ప్రజల నుంచి మద్దుతు కోరుతున్నామని తెలిపారు.
Similar News
News January 7, 2026
అనుమానంతో హత్య.. భర్తకు జీవిత ఖైదు: VZM SP

భార్యపై వివాహేతర సంబంధం అనుమానంతో హత్య చేసిన కేసులో నిందితుడు చేమల చినకనకారావు (32)కి జీవిత ఖైదు, రూ.3,000 జరిమాన విధిస్తూ విజయనగరం 5వ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. 2024 మే 26న ఎస్.కోట మండలం కొత్త మరుపల్లిలో ఈ ఘటన జరిగింది. కేసు విచారణలో నేరం రుజువుకావడంతో శిక్ష ఖరారైందని SP దామోదర్ తెలిపారు. పీపీ, పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News January 7, 2026
మ్యుటేషన్స్ తిరస్కరణలు తగ్గాలి: VZM కలెక్టర్ ఆదేశాలు

తహశీల్దార్లు తిరస్కరించిన ప్రతి వినతిని ఆర్‌డీవోలు క్షుణ్ణంగా పరిశీలించి రోజువారీగా సమీక్షించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం ఆదేశించారు. జిల్లాలో మ్యుటేషన్స్ తిరస్కరణలు 33.77% ఉండటం ఆందోళనకరమని, వీటిని తగ్గించాలని ఆయన సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని, పెండింగ్ కేసులు గడువు లోపలే పరిష్కరించాలని అన్నారు. ధాన్యం సేకరణ సంక్రాంతి లోపల పూర్తి చేయాలన్నారు.
News January 7, 2026
ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచండి: VZM కలెక్టర్

వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యానికి తగ్గ ఆదాయం రాకపోవడంపై బుధవారం సమీక్షించారు. గనుల శాఖలో లీజుల గడువు ముగియడంతో ఆదాయం తగ్గిందని, త్వరలో పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా లక్ష్యానికి దగ్గరగా ఆదాయం వచ్చిందని, నాటుసారా, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


