News July 16, 2024

జడ్చర్ల: బస్సు దగ్ధం.. కోలుకుంటున్న బాధితులు

image

జడ్చర్ల సమీపంలో NH-44పై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 15 మంది ప్రయాణికులు కోలుకుంటున్నారు. బస్సులో 36 మంది ఉండగా ఆరుగురు కర్నూలు, నంద్యాల, మరో 30 మంది అనంతపురం, గుత్తి, HYD తదితర ప్రాంతాల వాళ్లు ఉన్నారు. పలువురిని మెరుగైన చికిత్స కోసం HYDకి తరలించారు. ఎస్పీ జానకి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సు అదనపు డ్రైవర్ కదిరప్ప ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐ ఆదిరెడ్డి తెలిపారు.

Similar News

News October 2, 2024

ఉమ్మడి MBNR జిల్లా ప్రత్యేక అధికారిగా రవి

image

తెలంగాణలోని10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా(MBNR, NRPT, WNP, NGKL, GDWL) ప్రత్యేక అధికారిగా కాలుష్య నివారణ బోర్డు సెక్రటరీ రవి ఐఏఎస్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

News October 2, 2024

పాన్‌గల్: క్షుద్ర పూజలు కలకలం.. గ్రామస్థుల్లో టెన్షన్..

image

పాన్‌గల్ మండలం కేతేపల్లి గ్రామంలోని గుండ్ల చెరువు‌కు వెళ్లే దారిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, తెల్లని పిండితో మనిషిని పోలిన బొమ్మను గీశారని గ్రామస్థులు తెలిపారు. దారి నుంచి పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. రాతియుగం నుంచి రాకెట్ యుగం వచ్చినా ఇలాంటి క్షుద్రపూజలు ఏంటని పలువురు అంటున్నారు.

News October 2, 2024

నాగర్ కర్నూల్‌ను నాశనంచేస్తున్న తండ్రి, కొడుకు:మర్రి జనార్దన్ రెడ్డి

image

సగం తెలిసిన MLC, అనుభవం లేని MLA నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. MLC దామోదర్ రెడ్డి, MLA రాజేష్ రెడ్డిలను ఉద్దేశించి విమర్శించారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చి తనకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలని మాజీ ఎమ్మెల్యే వారికి సవాల్ విసిరారు.