News July 16, 2024
PHOTO: హత్యాయత్నం తర్వాత ట్రంప్
కాల్పుల <<13624982>>ఘటనలో<<>> రెప్పపాటులో ప్రాణాలతో బయటపడిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. వీఐపీ బాక్స్‌లోని సీట్లో కూర్చున్నారు. బ్లూకలర్ సూట్‌తో పాటు తన ట్రేడ్ మార్క్ రెడ్ టై ధరించారు. చెవికి బ్యాండేజీతో ఆయన కనిపించారు. ఈ సదస్సులోనే ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్‌ను ఆయన ప్రకటించారు.
Similar News
News January 22, 2025
BIG BREAKING: రాష్ట్రానికి భారీ పెట్టుబడి
తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా ఆ కంపెనీ భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు చేపట్టనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు రానున్నాయి. 7వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఈ ఎంవోయూ జరిగింది.
News January 22, 2025
దారుణం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించాడు!
హైదరాబాద్ మీర్‌పేట్‌లో వెంకట మాధవి (35) అనే మహిళ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. ఆమెపై అనుమానంతో భర్త గురుమూర్తే చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు దర్యాప్తులో తేలింది. వాటిని కుక్కర్‌లో ఉడికించి, ఆ తర్వాత జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 18 నుంచి మాధవి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
News January 22, 2025
‘ఉబర్’లో కొత్త మోసం!
ప్రముఖ రైడ్ షేరింగ్ యాప్ ‘ఉబర్’పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. మొబైల్ ఛార్జింగ్ పర్సంటేజ్‌ను బట్టి ట్రిప్ ఛార్జిని నిర్ణయిస్తున్నట్లు ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఫుల్ ఛార్జింగ్ నుంచి తక్కువ పర్సంటేజ్ గల నాలుగు మొబైల్స్‌లో ఒకే లొకేషన్‌కు ఉబర్‌లో బుకింగ్స్ చెక్ చేశారు. ఛార్జింగ్ తక్కువగా ఉన్న మొబైల్‌లో ఎక్కువ, ఫుల్ ఛార్జి ఉన్నదాంట్లో తక్కువ ధర చూపించింది. ఈ మోసాన్ని మీరెప్పుడైనా గమనించారా?