News July 16, 2024
VZM: రైల్వే ఉద్యోగి సూసైడ్

విజయనగరంలోని అలకానంద కాలనీలో ఓ రైల్వే ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం, రైల్వేలో టీఏగా పనిచేస్తున్న శంకర్రావు మధ్యానికి బానిస కావడంతో భార్య ఆదివారం రాత్రి మందలించింది. మనస్తాపానికి గురైన శంకర్రావు తన రూమ్‌లో ఉరివేసుకున్నాడు. సోమవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News November 6, 2025
VZM: ‘రియల్ టైం గవర్నెన్స్‌తో ప్రజలకు చేరువుగా సేవలు’

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు మరింత చేరువవుతున్నాయని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఎస్పీ పాల్గొన్నారు. నేర నియంత్రణలో టెక్నాలజీ వినియోగంపై సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు అందజేశారన్నారు. ఈ మేరకు అమలు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
News November 6, 2025
రాజాం: పాము కాటుకు గురైన రైతులు

రాజాం మండలంలో పొలం పనులు కొనసాగుతుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా విషకీటకాల బారినపడుతున్నారు. పాము కాటు బాధితుల్లో 90% మంది వీరే ఉంటున్నారు. మండలంలో అమరం గ్రామానికి చెందిన శంకర్రావు, సంకిలి గ్రామానికి చెందిన శివ, కింజంగి గ్రామానికి చెందిన శ్రీరాము, పెంట గ్రామానికి చెందిన ఆదినారాయణ వరికోతలు చేస్తుండగా బుధవారం పాము కాటుకు గురయ్యారు. వీరు రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News November 6, 2025
ఆర్డీవోలు తహశీల్దార్లతో సమీక్షించాలి: VZM కలెక్టర్

రెవెన్యూ సేవల కోసం అందిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ వినతులు ఉంటే సహించేది లేదన్నారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, OBC, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్లు వంటి సేవలు నిర్దేశిత గడువు దాటకుండా పూర్తవ్వాలని, ఆర్డీవోలు రోజువారీగా తహశీల్దార్లతో సమీక్షించాలన్నారు.


