News July 16, 2024

ఖమ్మం రోటరీ నగర్‌లో వృద్ధురాలు దారుణ హత్య

image

ఖమ్మం రోటరీ నగర్‌లో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. అర్ధరాత్రి అమ్మమ్మను మనుమడు కొట్టి చంపినట్లు స్థానికులు తెలిపారు. దురలవాట్లకు బానిసైన అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 11, 2026

రూ.547 కోట్ల సైబర్ మోసం.. 17 మంది అరెస్టు

image

కాల్ సెంటర్లు, ఏపీకే ఫైళ్లు, ఓటీపీల ద్వారా అమాయకులను బురిడీ కొట్టించి రూ.547 కోట్లు కొల్లగొట్టిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పెనుబల్లి పోలీస్ స్టేషన్‌లో సీపీ సునీల్ దత్ వివరాలు వెల్లడిస్తూ.. ఈ ముఠా విదేశీ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి మోసాలకు పాల్పడిందని తెలిపారు. నిందితుల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, వారి ఆస్తులను జప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News January 11, 2026

మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యం: మంత్రి తుమ్మల

image

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం మంత్రి స్వగృహంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికలకు పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించారు

News January 11, 2026

వణుకుతున్న ఖమ్మం జిల్లా

image

ఖమ్మం జిల్లాను చలి వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా రాత్రితో పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. శనివారం మధ్యాహ్నం సైతం ఉష్ణోగ్రత 18 డిగ్రీల కంటే తక్కువగా నమోదు కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. తీవ్రమైన చలిగాలుల ధాటికి జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు చలికోట్లు, మంకీ క్యాపులు, మఫ్లర్లు ధరిస్తూ రక్షణ పొందుతున్నారు.