News July 16, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.13351 ధన్‌బాద్- అలప్పుజ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు విజయవాడ- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ- భీమవరం మార్గం గుండా ఈ ట్రైన్ నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ ట్రైన్‌కు తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
MTM: నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్‌లో “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలలో కూడా PGRS జరుగుతుందని ఆయన వెల్లడించారు.

News November 8, 2025
కృష్ణా: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి తన నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ. 14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులు కృష్ణా జిల్లా పెడనకి చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.