News July 16, 2024

ఆ వాట్సాప్‌ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దు: పోలీసులు

image

తెలియని నంబర్ నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేసి చిక్కుల్లో పడొద్దని తెలంగాణ పోలీసులు సూచించారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి మోసాలు పెరగడంతో అవగాహన కల్పిస్తున్నారు. ‘ఉన్నట్టుండి మీ ఫోన్‌కి అపరిచితుల నుంచి వీడియో కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తగానే నగ్నంగా ఉన్న అమ్మాయి మీతో కవ్వింపుగా మాట్లాడుతుంది. అదంతా రికార్డ్ చేసి ఆ వీడియోతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Similar News

News September 13, 2024

బంగ్లాపై భారత్ సునాయాసంగా గెలుస్తుంది: దినేశ్ కార్తీక్

image

బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో భారత జట్టు సునాయాసంగా గెలుస్తుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ జోస్యం చెప్పారు. స్వదేశంలో భారత్‌ను పెద్ద జట్లు కూడా ఇబ్బంది పెట్టేలేకపోయాయన్నారు. ‘పాకిస్థాన్‌లో బంగ్లా బాగా ఆడింది. కాదనను. కానీ టీమ్ ఇండియాను వారు పెద్దగా ఇబ్బంది పెడతారని అనుకోవట్లేదు. ఇండియాలో ఇండియాను ఓడించడం చాలా కష్టం’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో ఈ నెల 19 నుంచి భారత్ 2 టెస్టులు ఆడనుంది.

News September 13, 2024

‘దేవర’లో 4 సీన్లపై సెన్సార్ అభ్యంతరాలు?

image

ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మూవీకి U/A సర్టిఫికెట్ లభించినట్లు ‘బాలీవుడ్ హంగామా’ పేర్కొంది. 4 సీన్లపై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందని తెలిపింది. ఓ పాత్ర తన భార్యను, మరో పాత్ర తన తల్లిని తన్నిన సీన్లను మూవీ టీం మార్చింది. ఇక కత్తిపై శరీరం వేలాడుతున్న ఓ సీన్‌ తొలగించారు. ఎన్టీఆర్ సొరచేపపై ప్రయాణించిన సన్నివేశంలో అది CGI షార్క్ అన్న టిక్కర్ వేయాలని బోర్డు సూచించింది.

News September 13, 2024

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడడంలో బాబు ఫెయిల్: విజయసాయిరెడ్డి

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్-3 ఆపివేయాలన్న నిర్ణయం ప్రైవేటీకరణ కుట్రలో భాగమేనని YCP MP విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్లాంట్‌ను కాపాడడంలో CM చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ‘అందరూ భయపడినట్లే జరిగింది. బాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇది తెలుగు జాతికి అతి పెద్ద ద్రోహం. దీనిని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని నేరం’ అని ఆయన ఎక్స్‌లో మండిపడ్డారు.