News July 16, 2024

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

AP: రాష్ట్రంలోని SC, ST వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. దీన్ని వారు వాయిదాల రూపంలో చెల్లించాలి. 2024-25 ఏడాదికిగానూ రూ.250 కోట్లు రుణంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సంబంధిత ఫైల్‌పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు.

Similar News

News April 3, 2026

నిగనిగలాడే మామిడి పండ్లు కొంటున్నారా?

image

సమ్మర్‌ వచ్చేసింది.. రోడ్ల పక్కన నిగనిగలాడే మామిడి పండ్లు నోరూరిస్తున్నాయా? వాటిని తింటే మీరు అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. కొందరు కాల్షియం కార్బైడ్, ఇతర రసాయనాలు కలిపి మగ్గబెడుతున్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని HYD CP సజ్జనార్ హెచ్చరించారు. సహజంగా పండిన పండు అంతా ఒకే రంగులో ఉండదని చెబుతున్నారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే 100కు లేదా 8712661212 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News April 3, 2026

రష్యా నుంచి 90% పెరిగిన ఆయిల్ దిగుమతులు

image

హార్ముజ్ సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతులు భారీగా పెరిగాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 90% అధికంగా చమురు వచ్చింది. అయినప్పటికీ దేశంలో మొత్తం ఇంపోర్ట్స్‌లో 15% తగ్గుదల నమోదైంది. గత నెలలో LPG దిగుమతులు 40% పడిపోగా, LNG రవాణా తగ్గిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ వనరులపై భారత్ దృష్టిపెట్టింది. రష్యాతోపాటు అంగోలా, గాబన్, ఘనా, కాంగో తదితర దేశాల నుంచి క్రూడ్‌ను కొనుగోలు చేస్తోంది.

News April 3, 2026

RGSSHలో 44 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతో ఎంపిక

image

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(RGSSH), న్యూఢిల్లీ.. కాంట్రాక్ట్ పద్ధతిలో 44 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిలో ప్రొఫెసర్‌-07, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-09, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-28 ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి MS/MD, MCh/DM అర్హత ఉండాలి. ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 10.04.26. మరిన్ని వివరాల కోసం rgssh.delhi.gov.in చూడండి.