News July 16, 2024

తమిళనాడులో మరో పార్టీ నేత దారుణహత్య

image

బీఎస్పీ TN చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ <<13574585>>హత్య<<>> మరువకముందే తమిళనాడులో మరో పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. నామ్ తమిళర్ కాచి(NTK) పార్టీ నేత బాలసుబ్రమణియన్‌ను మధురై‌లోని తాళ్లకులం పోలీస్ స్టేషన్‌కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతనిపై గతంలో 3 కేసులు ఉన్నాయని, వ్యక్తిగత కక్షలతో హత్య చేసి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు.

Similar News

News April 11, 2026

25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు ప్రకటన

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల పరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే చివరి వరకు దేశంలోని వివిధ సెంటర్లలో <>ఎగ్జామ్స్<<>> జరుగుతాయని పేర్కొంది. కాగా ఫిబ్రవరి 23నే పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, NCBలో మొత్తం 25,487 ఉద్యోగాలు ఉన్నాయి.
Share It

News April 11, 2026

రేపటి వరకు వర్షాలు!

image

ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సముద్ర మట్టానికి 0.9కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఆస్కారముందని వివరించింది.

News April 11, 2026

బాలీవుడ్ డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్లీ బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీతో కలిసి భారీ పాన్ ఇండియా సినిమా తీయనున్నట్లు సమాచారం. దాదాపు ₹800 కోట్ల బడ్జెట్‌తో హిస్టారికల్ జంగిల్ అడ్వెంచర్‌ రూపొందనుందని టాక్. భన్సాలీ తన ‘గంగూబాయి కతియావాడి’ విజయం తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. చరణ్ 2013లో ‘జంజీర్’(తుఫాన్)తో బాలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చారు.