News July 16, 2024
ప.గో.: విద్యుత్ శాఖలో నలుగురికి పదోన్నతులు

ఉమ్మడి ప.గో. జిల్లాకు సంబంధించి విద్యుత్ శాఖలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు నలుగురికి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు SE సాల్మన్ రాజు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.వేణుగోపాల్‌ను తాడేపల్లిగూడెం నుంచి తణుకు, ఎం.శ్రీనివాసరాజును భీమవరం, చంద్రకళను నిడదవోలు నుంచి ఏలూరు టౌన్, యూవీవీ భాస్కరరావును తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు జేఏవోగా నియమించారు.
Similar News
News November 9, 2025
తణుకు: బీసీ వసతి గృహంలో కలెక్టర్ తనిఖీలు

తణుకులోని పాత ఊరు బాలికల బీసీ హాస్టల్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడి, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, రుచిగా ఉందా అని ఆరా తీశారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 9, 2025
ఇరగవరం: విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం వద్ద ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరి కోత మిషన్‌ను వ్యాన్‌లో తరలిస్తుండగా, 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో ప.గో జిల్లా ఇరగవరం మండలానికి చెందిన కె. సింహాద్రి అప్పన్న (58), జి. సందీప్ (26) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News November 9, 2025
భీమవరం: భక్త కనకదాసు జయంతి

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు శ్రీ భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త అని అన్నారు.


