News July 16, 2024
ప్రజలకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు ఉండాలి: సీఎం రేవంత్

తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని కలెక్టర్లకు CM రేవంత్ సూచించారు. ఏసీ గదులకే పరిమితమైతే సంతృప్తి ఉండదని, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవాలన్నారు. సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజలకు లబ్ధి చేకూరే నిర్ణయాలతో పాటు, ఎప్పటికీ గుర్తుండిపోయేలా పని చేయాలని ఆదేశించారు.
Similar News
News April 8, 2026
అమెజాన్‌లో మరో 14 వేల మంది తొలగింపు!

అమెజాన్ మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మే 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో 16,000 మందిని తీసేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా AWS, రిటైల్, HR విభాగాల్లోని మిడ్-లెవల్ మేనేజర్లపై ఈ ప్రభావం పడనుంది. AI కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
News April 8, 2026
మోదీజీ ఎవరిని ఫూల్ చేస్తున్నారు: ప్రకాశ్ రాజ్

ముద్రా యోజన పథకం ద్వారా 52 కోట్ల మందిని వ్యాపారులుగా మార్చామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. 150 కోట్ల జనాభాలో 52 కోట్ల మంది వ్యాపారులుగా మారారా? అని ప్రశ్నించారు. ఎవరిని ఫూల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతకుముందు ఈ పథకం ద్వారా అనేక మంది వ్యాపార కలలను సాకారం చేశామని ప్రధాని Xలో పోస్ట్ చేశారు. దాదాపు 52 కోట్ల మందిని వ్యాపారులుగా మార్చామన్న ‘MyGovIndia’ పోస్ట్‌ను షేర్ చేశారు.
News April 8, 2026
సమ్మర్‌లో ఇది నానబెట్టుకుని తింటే..

సమ్మర్‌లో గోండ్ కటీరా బాడీని కూల్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒక నేచురల్ గమ్. Astragalus species అనే మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. రాత్రి ఒక స్పూన్ కటీరాను గ్లాసు నీటిలో నానబెడితే జెల్లీలా తయారవుతుంది. దీన్ని షర్బత్, పాలు, నిమ్మరసంలో కలుపుకొని తాగాలి. డీహైడ్రేషన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గేందుకు సాయపడుతుంది. వెంట్రుకలు, చర్మ ఆరోగ్యానికీ మంచిది.


