News July 16, 2024

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్: మంత్రి

image

AP: రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్కీమ్ అమలుకు పంద్రాగస్టు నుంచి శ్రీకారం చుట్టనుంది.

Similar News

News September 15, 2025

మరో వివాదంలో పూజా ఖేడ్కర్

image

మహారాష్ట్రకు చెందిన మాజీ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ విషయంలో ఆమె పేరు బయటికి వచ్చింది. ముంబైలోని ఐరోలిలో డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ తన ట్రక్‌తో ఓ కారును ఢీకొట్టారు. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు. పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయగా పుణేలోని పూజా ఇంటిలో చూపించింది. డ్రైవర్‌ను విడిపిస్తున్న క్రమంలో పూజా తల్లి మనోరమ హంగామా చేశారు.

News September 15, 2025

దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్

image

దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ జట్టు నిలిచింది. బెంగళూరులో జరిగిన ఫైనల్లో సౌత్ జోన్‌పై ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో సెంట్రల్ జోన్ ప్లేయర్స్ యశ్ రాథోడ్(194), కెప్టెన్ పాటీదార్(101) సెంచరీలతో చెలరేగారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా సారాన్ష్ జైన్(8 వికెట్లు, 69 రన్స్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా యశ్ (194, 13 రన్స్) నిలిచారు. స్కోర్లు: సౌత్ జోన్ 149&426, సెంట్రల్ జోన్ 511&66/4.

News September 15, 2025

త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: మంత్రి అనగాని

image

AP: భూకబ్జాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చామని మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఫ్రీహోల్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలను కూడా అరికట్టేలా చర్యలు చేపట్టామన్నారు. నాలా చట్టాన్ని రద్దు చేసి పారిశ్రామిక వేత్తలకు, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా చేశామని వివరించారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరలోనే సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.