News July 16, 2024

కడప, అన్నమయ్య జిల్లాలో రూ.1000 కోట్ల భూ ఆక్రమణలు: సీఎం

image

కడప, అన్నమయ్య జిల్లాలో సుమారు రూ.1000 కోట్లు విలువగల భూములు వైసీపీ నాయకులు, కార్యకర్తల చేతిలో ఉన్నాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తాజాగా సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో కడప జిల్లాలో 5,796.54 ఎకరాల భూములను 3,357 మందికి, అన్నమయ్య జిల్లాలో 103.15 ఎకరాలను 84 మందికి అక్రమంగా కట్టబెట్టినట్లు సీఎం ప్రకటించారు. ఇటువంటి వారిని విచారించి కఠిన శిక్షలు పడేలా చేస్తానని పేర్కొన్నారు.

Similar News

News July 6, 2025

పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

image

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PS‌లో ఫిర్యాదు చేసింది.

News July 6, 2025

MLA వరదకు సర్జరీ.. కాల్ చేసి మాట్లాడిన CM

image

ప్రొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి గుండె ఓపెన్ సర్జరీ చేయించుకుని HYD ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న CBN శనివారం వరదకు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలంటూ ఆకాంక్షించినట్లు సమాచారం.

News July 6, 2025

కడప: ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశం

image

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్ టీచర్ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. అన్ని పాఠశాలలో మెరుగైన వసతులతో పాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు.