News July 16, 2024
శ్రీశైలం ఈవోగా IAS అధికారి.?

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం తదుపరి ఈవోగా IAS అధికారిని నియమించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయం అభివృద్ధి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో IAS అధికారి డా.నారాయణ భరత్ గుప్తా ఈవోగా ఉండగా, ఆయనకు ప్రభుత్వం కమిషనర్ ర్యాంక్ అధికారాలను కల్పించింది. కాగా అత్యధికంగా గ్రూప్-1 ర్యాంక్ అధికారులు ఈవోలుగా పని చేశారు.
Similar News
News March 2, 2026
బాల్య వివాహాల నిర్మూలనకు ‘విముక్తి రథం’

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో బాల్య వివాహాల విముక్తి రథాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో పర్యటిస్తూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తుందని వారు తెలిపారు. ఆడపిల్లలను చదువు ద్వారా ప్రయోజకులను చేయాలని, చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేయవద్దని కోరారు.
News March 1, 2026
కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలి ఉండే వెబ్‌సైట్లను సృష్టించి, భారీ డిస్కౌంట్ల పేరుతో ముందస్తు చెల్లింపులు తీసుకుని వస్తువులు పంపకుండా కేటుగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
News March 1, 2026
కర్నూలు: మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. కలెక్టర్ ఆదేశం!

కర్నూలు జిల్లాలో మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ డా.ఏ సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని NCORD సమావేశంలో మాట్లాడుతూ.. విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలని, RTC బస్సుల్లో అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. జనవరి నుంచి జిల్లాలో 2 కేసులు నమోదు చేసి 1.350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సాగుపై నిఘా ఉంచాలని రెవెన్యూ, పోలీసు శాఖలను కలెక్టర్ ఆదేశించారు.


