News July 16, 2024

ట్రంప్ ప్రచారానికి నెల నెలా రూ.376 కోట్లు.. మస్క్ సాయం

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి ఎలాన్ మస్క్ నెల నెలా 45 మిలియన్ డాలర్లు (రూ.376 కోట్లు) ఇవ్వనున్నారని అక్కడి మీడియా తెలిపింది. ట్రంప్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న PACకి ఆయన ఈ డొనేషన్ అందజేస్తారని వెల్లడించింది. ట్రంప్‌పై దాడి తర్వాత ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. కాగా ట్రంప్‌కుగానీ, బైడెన్‌కు గానీ తాను ఆర్థిక సాయం చేయనని గతంలో మస్క్ ప్రకటించారు.

Similar News

News January 13, 2026

నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్’: కామారెడ్డి ఎస్పీ

image

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి ప్రారంభమయ్యే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో విజయవంతం చేయాలని SP రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూనే, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా భద్రత, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

News January 13, 2026

ఎంత ప్రయత్నించినా పెళ్లి కావడం లేదా? రేపే లాస్ట్..

image

ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి సంబంధం కుదరని వారు రేపు గోదా రంగనాథుల కళ్యాణాన్ని వీక్షించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ వేడుకను దర్శిస్తే తప్పక వివాహ యోగం కలుగుతుందని అంటున్నారు. ‘స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల జాతకంలోని వివాహ ప్రతిబంధకాలు తొలగిపోతాయి. త్వరగా పెళ్లి జరిగే అవకాశాలు పెరుగుతాయి. గోదాదేవి చేసిన తిరుప్పావై వ్రత ఫలితంగానే ఆమెకు విష్ణుమూర్తి భర్తగా లభించారు’ అని చెబుతున్నారు.

News January 13, 2026

భారత్‌కు మరో S-400.. వచ్చేది ఎప్పుడంటే?

image

భారత రక్షణ శక్తి మరింత బలోపేతం కానుంది. రష్యా నుంచి నాలుగో S-400 క్షిపణి వ్యవస్థ ఈ ఏడాది మే నాటికి భారత్‌కు అందనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. 2018లో కుదిరిన రూ.40 వేల కోట్ల ఒప్పందం ప్రకారం మొత్తం 5 వ్యవస్థలు కొనుగోలు చేయగా, ఇప్పటికే 3 భారత్‌కు చేరాయి. నాలుగోది ఈ ఏడాది మేలో, చివరిది 2027లో డెలివరీ కానుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400లు అద్భుతంగా పని చేసిన విషయం తెలిసిందే.