News July 16, 2024
రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ: CM రేవంత్

TG: రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి రేషన్ కార్డుతో లింకు పెట్టొద్దని సూచించారు. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సచివాలయంలో కలెక్టర్లతో సమావేశంలో అన్నారు. రూరల్ వైద్యులను ప్రోత్సహించేలా ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్‌కు సీరియల్ నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదు: మోదీ

పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని ప్రధాని మోదీ అన్నారు. అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి ఇదే రోజు విముక్తి లభించిందని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయి పటేల్ ధైర్యసాహసాలు ప్రదర్శించి భారత్‌లో విలీనం చేశారని చెప్పారు.
News September 17, 2025
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాబోయే 3గంటల్లో నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, HYD, జగిత్యాల, జనగాం, BHPL, కామారెడ్డి, KNR, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, PDPL, సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.
News September 17, 2025
PM AI వీడియో తొలగించండి: పట్నా హైకోర్టు

ప్రధాని మోదీని ఆయన తల్లి మందలిస్తున్నట్టు రూపొందించిన <<17688399>>AI వీడియోను<<>> సోషల్ మీడియా నుంచి తొలగించాలని బిహార్‌లోని పట్నా హైకోర్టు కాంగ్రెస్ పార్టీని ఆదేశించింది. SEP 10న బిహార్ కాంగ్రెస్ మోదీపై AI వీడియో క్రియేట్ చేసి Xలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని బీజేపీ, NDA మిత్ర పక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ సెల్ వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు వీడియో తొలగించాలని ఆదేశించింది.