News July 16, 2024
రైతు రుణమాఫీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

TG: ఎల్లుండి నుంచి జమ చేసే రైతు రుణమాఫీ డబ్బులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఈ నెల 18న రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
Similar News
News April 2, 2026
హార్ముజ్ సంక్షోభంపై కీలక భేటీ.. భారత్ అటెండ్!

హార్ముజ్ మీదుగా నౌకల రాకపోకలపై UK ఏర్పాటు చేయనున్న కీలక సమావేశంలో భారత్ పాల్గొంటుందని కేంద్రం తెలిపింది. ఈరోజే జరగనున్న ఈ వర్చువల్ భేటీకి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరవుతారని వెల్లడించింది. గ్యాస్, ఇంధనంతో వస్తున్న భారత నౌకల భద్రత కోసం ఇరాన్ సహా ఇతర దేశాలతో టచ్‌లో ఉన్నామని, ఇప్పటికే 6 నౌకలు సేఫ్‌గా దాటాయని తెలిపింది. హార్ముజ్ సంక్షోభాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది.
News April 2, 2026
దేశమంతా అమరావతి వెంట నిలబడింది: CBN

AP: అమరావతి అత్యంత పవిత్ర స్థలమని CM CBN అభివర్ణించారు. ‘దేశంలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా స్థలాల నుంచి మట్టిని, నదుల నుంచి జలాన్ని తెచ్చి పునీతం చేశాం. అలాంటి ఈ ప్రాంతాన్ని గత పాలకులు మూడుముక్కలాటతో విధ్వంసం చేశారు. కానీ ఇవాళ పార్లమెంటులో YCP తప్ప దేశంలోని అన్ని పార్టీలు అమరావతి వెంట నిలిచాయి’ అని ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించిన సభలో పేర్కొన్నారు. అమరావతిని వరల్డ్ బెస్ట్ సిటీగా మారుస్తామన్నారు.
News April 2, 2026
SRH బ్యాటింగ్.. జట్టులో మార్పు

IPL: SRHతో మ్యాచులో KKR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎషాన్ మలింగ స్థానంలో పైన్, హర్షల్ పటేల్ స్థానంలో శివాంగ్ కుమార్ SRHలోకి వచ్చారు.
SRH: అభిషేక్, హెడ్, కిషన్ (C), క్లాసెన్, అనికేత్, నితీశ్, సలీల్, హర్ష్ దూబే, ఉనద్కత్, పైన్, శివాంగ్ కుమార్.
KKR: రహానె (C), గ్రీన్, రఘువంశీ, రింకూ, రమణ్‌దీప్, అనుకుల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, ముజరబాని.


