News July 16, 2024

ఆ రూ.500 నోట్లు ఫేక్ అని ప్రచారం.. ఖండించిన PIB FACT CHECK

image

స్టార్ సింబల్ ఉన్న రూ.500 నోట్లు ఫేక్ అని వాట్సాప్‌లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ప్రజల్లో ఆందోళన నెలకొనడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB FACT CHECK స్పందించింది. ఇది తప్పుడు ప్రచారం అని తేల్చింది. డిసెంబర్ 2016 నుంచి స్టార్(*) మార్క్‌ కలిగిన రూ.500 నోట్లు చలామణిలో ఉన్నట్లు పేర్కొంది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని సూచించింది.

Similar News

News November 4, 2025

కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని..

image

TG: కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టంలేని కుటుంబసభ్యులు అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఝరాసంగం మం. కక్కర్‌వాడలోని విఠల్ కూతురు, అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణ ప్రేమించుకున్నారు. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో విఠల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కుమారుడు పాండుతో కలిసి రాధాకృష్ణ తండ్రిపై ఘోరంగా దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు.

News November 4, 2025

వంటింటి చిట్కాలు

image

*మరమరాలు మెత్తబడినప్పుడు రెండు నిమిషాలు వేయిస్తే మళ్లీ కరకరలాడతాయి.
* చేపను ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ చేయాలంటే ముక్కలుగా కోసి ఉప్పు, వెనిగర్ పట్టించి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి.
* ఉసిరికాయ నిల్వ పచ్చడి నలుపెక్కకుండా ఉండాలంటే జాడీలో పెట్టిన తర్వాత మధ్యలో ఇంగువ ముక్క ఉంచండి.
* బెండకాయలు 2, 3 రోజులు తాజాగా ఉండాలంటే తొడిమలతో పాటు రెండో చివరను కూడా కోసి ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.

News November 4, 2025

RITESలో 600 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. *ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.