News July 16, 2024

సీఎం చదివిన స్కూల్ నూతన భవనం నమూనా ఇదే!

image

వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న పాఠశాల నూతన భవనం నమూనాను ఎమ్మెల్యే మేఘారెడ్డి విడుదల చేశారు. సుమారు రూ.160 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ భవనంలో పాఠశాలతో పాటు, జూనియర్ కళాశాల, షాపింగ్ కాంప్లెక్స్ నమూనాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎంకు ఎమ్మెల్యే ప్రతిపాదనలు సమర్పించగా ఆయన సూతప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

Similar News

News January 16, 2025

నాగర్ కర్నూల్: అదనపు కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

image

నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్‌గా పి.అమరేందర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్‌ బాదావత్ సంతోష్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసి, జిల్లాకు అదనపు కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ఏవో చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

News January 16, 2025

శ్రీశైలం: స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవలు

image

శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో గురువారం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.

News January 16, 2025

UPDATE: కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు

image

కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామం వద్ద తిరుపతి హైవేపై బుధవారం సాయంత్రం <<15163728>>ఘోర రోడ్డు<<>> ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల వివరాలు.. కల్వకుర్తి మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బంగారయ్య (36), మహేశ్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.