News July 16, 2024
రూ.2 లక్షల రుణమాఫీ.. గోల్డ్ లోన్ తీసుకున్న వారికి వర్తిస్తుందా?

TG: బ్యాంకుల్లో బంగారం పెట్టి క్రాప్ లోన్ తీసుకున్న వాళ్లకు పాస్ బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. అర్హులైన రైతులకు రేషన్‌కార్డు లేకపోయినా మాఫీ చేస్తామన్నారు. ‘MLAలు, IAS, ఉన్నతాధికారులకు రుణమాఫీ ఉండదు. వ్యవసాయం చేసే గ్రూప్-4 ఉద్యోగులకూ మాఫీ చేస్తాం. 11.50 లక్షల మందికి రూ.లక్ష వరకు బకాయిలు ఉన్నాయి. వీరి కోసం ఎల్లుండి రూ.6వేల కోట్లు రిలీజ్ చేస్తున్నాం’ అని తెలిపారు.
Similar News
News October 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి
News October 25, 2025
జర్నలిస్టులకు స్థలాలిచ్చి ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పార్థసారథి

AP: పేదలందరికీ ఇళ్లు, స్థలాలివ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. అర్హులైన వారందరికీ 2, 3 సెంట్లు స్థలాలు ఎలా ఇవ్వాలో GOM భేటీలో చర్చించామన్నారు. జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. అయితే SC తీర్పు ఉన్న నేపథ్యంలో లీగల్‌గా ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం అడుగుతామని మంత్రి వివరించారు.
News October 25, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 25, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.59 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.12 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.11 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.48 గంటలకు
✒ ఇష: రాత్రి 7.01 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు


