News July 16, 2024
T-SAT సేవలు తక్షణమే పునరుద్ధరించాలి: KTR

TG: T-SAT ఛానళ్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూగబోయాయని కేటీఆర్ ఆరోపించారు. ‘ప్రస్తుతం కొన్ని నోటిఫికేషన్లు విడుదలైన పరిస్థితుల్లో T-SAT ఛానళ్ల ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ అందేది. కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాలతో వారికి తీవ్ర నష్టం జరుగుతోంది. NSILతో ఒప్పందంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. తక్షణమే T-SAT సేవలు పునరుద్ధరించాలి’ అని KTR డిమాండ్ చేశారు.
Similar News
News August 31, 2025
బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం

తెలంగాణ అసెంబ్లీలో మూడు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు, మున్సిపల్ చట్టసవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. తొలుత మున్సిపల్, ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించారు.
News August 31, 2025
బీసీ బిల్లుకు BJP పూర్తి మద్దతు: పాయల్ శంకర్

TG: బిల్లుపై బీసీలకున్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ‘42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ చర్చించాలి. మీ చేతిలోని అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేంటి ఇబ్బంది? మంత్రివర్గంలో BCల సంఖ్య ఎంత? బీసీల సంక్షేమం కోసం ఏడాదికి రూ.20 వేలకోట్లు చొప్పున ఇస్తామన్నారు. ఇప్పటికీ 4 పైసలు రాలేదు’ అని వ్యాఖ్యానించారు.
News August 31, 2025
బార్లకు తగ్గిన దరఖాస్తుల కిక్కు

APలో సగానికి పైగా బార్లకు మళ్లీ దరఖాస్తులు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 840 బార్లకు మూడేళ్ల పరిమితితో నోటిఫికేషన్ ఇవ్వగా 388 బార్లకు నిన్న లాటరీలు తీసి, టెండర్లు ఖరారు చేశారు. నిబంధనల ప్రకారం ఒక బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు రాకపోవడంతో 452 బార్లకు లాటరీ తీయలేదు. 37 బార్లకు ఒకట్రెండు దరఖాస్తులే రావడంతో రేపటి వరకు గడువు పొడిగించారు. వీటికి నాలుగేసి దరఖాస్తులొస్తే ఎల్లుండి లాటరీ తీస్తారు.