News July 16, 2024
3,220 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశం

APలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,220 ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఈ ఉద్యోగాల భర్తీలో నెలకొన్న న్యాయపరమైన చిక్కులను తొలగించాలని సూచించారు. పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ఉండాలని ఉన్నత విద్యపై అధికారులతో సమీక్షలో లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇక కాలేజీల్లో డ్రగ్స్‌పై విద్యార్థులను చైతన్యం చేసేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు.
Similar News
News January 25, 2026
APPLY NOW: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

<
News January 25, 2026
తేజస్వీ యాదవ్‌కు ఆర్జేడీ పగ్గాలు

రాష్ట్రీయ జనతాదళ్(RJD) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వీ యాదవ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ డిప్యూటీ సీఎంగా అనుభవం ఉన్న తేజస్వి ఇకపై పార్టీ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్నారు.
News January 25, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ITI, డిప్లొమా, BSc(MPC/CS)అర్హత గలవారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 28వరకు పంపాలి. వయసు 18 నుంచి 36ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెక్నీషియన్‌కు నెలకు రూ.22,240, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.31,020 చెల్లిస్తారు. సైట్: https://recruit.cusat.ac.in


