News July 17, 2024

TODAY HEADLINES

image

☛ అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. విభజన సమస్యలపై చర్చ
☛ ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
☛ ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
☛ ఈ నెల 18న రూ.లక్ష వరకు రుణాలు మాఫీ: CM రేవంత్
☛ రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ: CM రేవంత్
☛ సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌.. విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని కోర్టు ఆదేశం
☛ J&Kలో ఉగ్రదాడి.. నలుగురు భారత జవాన్లు మృతి

Similar News

News September 19, 2025

రైల్వేకు ‘మహిళా శక్తి’ని పరిచయం చేసిన సురేఖ

image

ఆడవాళ్లు రైలు నడుపుతారా? అనే ప్రశ్నలను, అడ్డంకులను దాటుకుని ఆసియాలోనే తొలి మహిళా లోకోపైలట్‌గా మారిన సురేఖా యాదవ్(మహారాష్ట్ర) పదవీ విరమణ పొందారు. ఆమె తన అసాధారణ ప్రయాణంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా మొదలైన ఆమె ప్రయాణం డెక్కన్ క్వీన్ రైళ్లను నడిపే వరకూ సాగింది. ఆమె ఉద్యోగ జీవితం భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిపోతుంది.

News September 19, 2025

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

image

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఒక ప్రాజెక్ట్ అసోసియేట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

* NIT- వరంగల్ 2 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగలవారు సెప్టెంబర్ 23వరకు అప్లై చేసుకోవచ్చు.

News September 19, 2025

‘కల్కి-2’ నుంచి దీపిక ఔట్.. కారణాలివేనా?

image

‘కల్కి-2’ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను <<17748690>>తీసేయడంపై<<>> నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమె డిమాండ్స్ వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన టీమ్ మొత్తాన్ని (25 మంది) లగ్జరీ హోటల్‌లో ఉంచాలనడంతో పాటు 25% రెమ్యునరేషన్ పెంచాలని, రోజుకు 5-7గంటలే పనిచేస్తానని డిమాండ్ చేశారట. ఆమె రెమ్యునరేషన్‌ హైక్‌కు ఓకే చెప్పినా, షూటింగ్ టైమ్ తగ్గించడానికి మాత్రం మేకర్స్ ఒప్పుకోలేదని సినీవర్గాలు పేర్కొన్నాయి.