News July 17, 2024
రాష్ట్ర ఆర్థిక దుస్థితిని అమిత్ షాకు వివరించా: CM చంద్రబాబు

AP: గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతలా దిగజారిందో అమిత్ షాకు వివరించినట్లు CM చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు విడుదల చేసిన 4 శ్వేతపత్రాలపై ఆయనతో చర్చించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ అసమర్థత, అవినీతి రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగించాయని ట్వీట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతాయని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు.
Similar News
News November 5, 2025
APPLY NOW : PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<
News November 5, 2025
చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.
News November 5, 2025
నేడు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

ఇవాళ గురుపూర్ణిమతో పాటు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆఫీసులు మూసి ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది కాబట్టి స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండనున్నాయి. ఉద్యోగులు ఎవరైనా కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు.


