News July 17, 2024
అమరావతిని NHతో కనెక్ట్ చేసేలా సీఆర్డీఏ ప్లాన్

AP: రాజధాని అమరావతిని జాతీయ రహదారితో అనుసంధానించేలా CRDA ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సీడ్ యాక్సిస్ రోడ్డు తరహాలో మరో రెండు రోడ్లు అభివృద్ధి చేయాలని భావిస్తోంది. చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేకు ఈ-11, 12 రోడ్లను కనెక్ట్ చేయాలని, కొండ అంచు నుంచి రోడ్లు నిర్మించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 24, 2026
కక్ష ఉంటే నాపై తీర్చుకోండి: KTR

TG: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు అని KTR అన్నారు. ACB <<19460633>>ఛార్జ్‌షీట్‌పై<<>> ఆయన స్పందించారు. ‘ఈ-కార్ రేసులో నిధుల దుర్వినియోగం జరగలేదు. బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరిగాయి. తప్పు చేయని అధికారులను ఎందుకు ఇరికించారు. కక్ష ఉంటే నాపై తీర్చుకోండి’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందిస్తూ ‘లొట్టపీసు కేసు అయితే భయమెందుకు? ధైర్యంగా ఎదుర్కోవాలి’ అని కౌంటరిచ్చారు.
News March 24, 2026
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

AP: ఇంటర్మీడియట్ పరీక్షలు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటికే వాల్యుయేషన్ చేపట్టిన బోర్డు ఫలితాలను APR 17న విడుదల చేసేలా కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు 8లక్షల పేపర్ల మూల్యాంకనం పూర్తయింది. సిలబస్ మారడం, సబ్జెక్టుల ఎలెక్టివ్ విధానం వల్ల పరీక్షలు విడివిడిగా పెట్టాల్సి వచ్చింది. దీనివల్ల 30రోజుల పాటు పరీక్షలు జరుగుతున్నాయి. కాగా మే మొదటివారంలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశముంది.
News March 24, 2026
రామ్ పోతినేని కొత్త సినిమా ఫిక్స్?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖరారైనట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌కు అసోసియేట్‌గా పనిచేసిన లోగి విఘ్నేశ్‌తో ఆయన సినిమా చేయనున్నట్లు పేర్కొన్నాయి. కథా చర్చలు జరిగాయని, హీరో స్టోరీని ఓకే చేశారని తెలిపాయి. 2026లోనే రిలీజయ్యే ఛాన్సుందని చెప్పాయి. కాగా రామ్ చివరగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాని సంగతి తెలిసిందే.


