News July 17, 2024

వాట్సాప్‌లో అందుబాటులోకి ‘ఫేవరెట్స్’ ఫీచర్

image

వాట్సాప్‌లో ‘ఫేవరెట్స్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మీరు ముఖ్యమైన కాంటాక్ట్స్‌కు వెంటనే కాల్ చేసేందుకు ఇది సాయపడుతుంది. ఇందుకోసం కాంటాక్ట్స్‌ను ఫేవరెట్స్ లిస్టులోకి యాడ్ చేసుకోవాలి. దీనికోసం యాప్‌లో ‘కాల్స్’ బటన్‌పై క్లిక్ చేయాలి. టాప్‌లో ‘Add to favorites’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కావాల్సిన నంబర్లను సెలక్ట్ చేసి యాడ్ చేయాలి. అవి కాల్స్ ట్యాబ్ క్లిక్ చేయగానే పైన కనిపిస్తాయి.

Similar News

News April 11, 2026

అమెరికా రాజధానిలో 250 అడుగుల ‘ఇండిపెండెన్స్ ఆర్చ్’!

image

US రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రతిపాదిత 250 ఫీట్ల ‘ఇండిపెండెన్స్ ఆర్చ్’ డిజైన్‌ను అధ్యక్షుడు ట్రంప్ షేర్ చేశారు. 200ఏళ్ల క్రితం ఓసారి, 124ఏళ్ల క్రితం మరోసారి ఇలాంటి నిర్మాణానికి అప్పటి పాలకులు ప్రయత్నించారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలో అన్ని ప్రధాన నగరాలకు స్మారకాలు ఉన్నాయని.. ఒక్క వాషింగ్టన్‌‌కే లేదన్నారు. దీనిపై అక్కడ మిశ్రమ స్పందన వస్తోంది. వైట్‌హౌస్‌లో మార్పులపైనా ఇటీవల <<19523130>>నిరసనలు<<>> చెలరేగాయి.

News April 11, 2026

చర్చల వేళ.. ఇరాన్‌కు భారీ ఊరట?

image

ఇరాన్‌తో శాంతి చర్చల వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఖతర్, ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన దాదాపు $100 బిలియన్ల ఇరాన్ ఆస్తులను రిలీజ్ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌ చర్చల సీరియస్‌నెస్‌కు ఇది నిదర్శనమని ఇరాన్ అధికారి వెల్లడించారు. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడంపై ఇది ముడిపడి ఉందని తెలిపారు. అయితే ఆస్తుల విడుదల అంశంపై అమెరికా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

News April 11, 2026

జాతీయ జట్టులోకి వైభవ్! ఐర్లాండ్‌ సిరీస్‌తో అరంగేట్రం?

image

వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టులోకి రావడం లాంఛనమే అనిపిస్తోంది. అతిపిన్న వయస్కుడిగా(15 ఏళ్లు) ఎంట్రీ ఇవ్వడానికి అతడు అర్హుడంటూ నిన్న RCBతో మ్యాచ్‌ అనంతరం IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2 టీ20 మ్యాచుల కోసం జూన్‌లో IND ఐర్లాండ్ వెళ్లనుంది. ఆ సిరీసే వైభవ్‌కు అరంగేట్రం అని తెలుస్తోంది. ఇప్పటివరకు యంగెస్ట్ క్రికెటర్‌ రికార్డ్ సచిన్(16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉంది.