News July 17, 2024
రేపు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం రహస్య గది
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదిని రేపు తెరవనున్నారు. ఇందుకోసం ఉ.9:51 నుంచి మ.12:15 వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. ఈనెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు తరలించి, వీడియోగ్రఫీ చేయించినట్లు అధికారులు తెలిపారు. రేపు రహస్య గదిలోని సంపదను మరో స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తారు. అనంతరం భాండాగారాన్ని మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తారు.
Similar News
News December 27, 2024
రాజ్యసభలో 33 ఏళ్లు
మన్మోహన్ సింగ్ 1991 నుంచి 2024 వరకు 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1991, 1995, 2001, 2007, 2013లో అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. చివరగా 2019లో రాజస్థాన్ నుంచి పెద్దలకు సభకు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌తో ఆయన పదవీకాలం ముగిసింది. ఈయన 1999లో తొలిసారి దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
News December 27, 2024
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వర మీని వేల్పు మోహరమునదా
నెక్కినబారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుగదరా సుమతీ!
తాత్పర్యం: అవసరానికి పనికిరాని బంధువును, నమస్కరించి వేడుకున్నా కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధంలో ముందుకు పరిగెత్తని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టవలెను.
News December 27, 2024
6 నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల భారం: మేరుగు
AP: అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తగ్గిస్తామని చంద్రబాబు మాయమాటలు చెప్పారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఫైరయ్యారు. ఇప్పుడు ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టారని దుయ్యబట్టారు. ప్రజలపై 6 నెలల్లోనే రూ.15,485 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు. కూటమి పాలన బాదుడే బాదుడుగా ఉందని ఎద్దేవా చేశారు. కరెంట్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.