News July 17, 2024

గిరిజన గ్రామాల్లో త్వరలో తారు రోడ్లు

image

AP: రాష్ట్రంలో 100కి పైగా జనాభా కలిగిన 149 గిరిజన ఆవాస ప్రాంతాల్లో తారు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలిదశలో రూ.280.53 కోట్లతో 130 రోడ్లు వేయనున్నారు. రెండో దశలో మరో 122 ఆవాస ప్రాంతాల్లో నిర్మించేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ స్కీమ్ కింద నిర్మించే ఈ రహదారులకు కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు సమకూర్చనున్నాయి.

Similar News

News January 23, 2025

నూతన DGP ఈయనేనా?

image

AP: DGP ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ సమయం దగ్గర పడటంతో కొత్త DGP ఎవరనే చర్చ జరుగుతోంది. నూతన DGPగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ DGగా ఉన్నారు. ఎన్నికలప్పుడు హరీశ్‌ను ఎన్నికల సంఘం DGPగా నియమించిన విషయం తెలిసిందే. పదవీకాలం పొడిగింపు కోసం తిరుమలరావు, పోలీస్ బాస్ పోస్ట్ కోసం CID DG రవిశంకర్ పోటీలో ఉన్నట్లు సమాచారం.

News January 23, 2025

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న ఉదయం అన్ని స్కూళ్లల్లో జాతీయ పతాకావిష్కరణ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఆదేశించారు. HMలు, విద్యాసంస్థల ప్రధానాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. విద్యార్థులు ఉదయం జాతీయ గీతం ఆలపిస్తూ మార్చ్ పాస్ట్ నిర్వహించాలని సూచించారు.

News January 23, 2025

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మదగజరాజా’

image

విశాల్‌ నటించిన ‘మదగజరాజా’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సత్యకృష్ణన్‌ ప్రొడక్షన్‌ సిద్ధమైంది. సంక్రాంతికి తమిళనాట రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. వరలక్ష్మి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్‌ ప్రేక్షకులను అలరిస్తోందని మూవీ టీం తెలిపింది. 12ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాలతో ఇంతకాలం విడుదల కాలేదు.