News July 17, 2024

విశాఖలో బొకారో ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

image

ధన్ బాద్-అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఏ2 సెకండ్ ఏసీ భోగికి స్ప్రింగ్ విరిగిపోయింది. రైలు విశాఖ స్టేషన్‌కు చేరుకునే సమయంలో జరగడంతో ఆవరణలో ఉన్న రోలింగ్ సిబ్బంది దానిని గుర్తించి సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. ప్రయాణికులను ఖాళీ చేయించి రైలు నుంచి బోగిని తొలగించారు. వేరొక బోగిని దానికి అమర్చారు. గంటన్నర పాటు రైలు స్టేషన్‌లో నిలిచిపోయింది.

Similar News

News January 5, 2026

మరికొన్ని గంటల్లో అర్జీలను స్వీకరించనున్న VZM కలెక్టర్

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News January 5, 2026

విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉదయ్

image

గజపతినగరంకు చెందిన దేవర ఉదయ్ కిరణ్‌ను భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఆదివారం నియమించింది. ఈ మేరకు పార్టీ జిల్లా అద్యక్షుడు రాజేష్ వర్మ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయ్ కిరణ్‌కు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.