News July 17, 2024

కారంచేడు ఘటనకు 39 ఏళ్లు పూర్తి

image

కారంచేడు ఘటనకు నేటితో 39 ఏళ్లు పూర్తయింది. 1985 జులై 17న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో దేశమంతా కారంచేడు వైపు చూసింది. కారంచేడు అనే ఊరి పేరు ఒక్కసారిగా దేశమంతటా మారుమ్రోగింది. ప్రతి సంవత్సరం జులై 17న చీరాల మండల పరిధిలోని విజయనగర్ కాలనిలో కారంచేడు మృత వీరుల రుధిర క్షేత్రం వద్ద సంస్మరణ సభను పలువురు నిర్వహిస్తారు.

Similar News

News January 17, 2026

మార్కాపురం జేసీ బాధ్యతలు స్వీకరణ

image

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న శ్రీనివాసులుకు అధికారుల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిటీ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

News January 17, 2026

నేడు దర్శి రానున్న మంత్రులు

image

దర్శిలో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. వీరితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, దర్శి ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరుకానున్నారు.