News July 17, 2024
సెప్టెంబర్ 26న యూఎన్‌లో మోదీ ప్రసంగం!
ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26న సభను ఉద్దేశించి ప్రసంగించే వారి ప్రాథమిక జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. తుది జాబితా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. యూఎన్ సాధారణ మండలి సమావేశాలు సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు జరగనున్నాయి. కాగా మోదీ చివరి సారిగా 2021 SEPTలో జరిగిన వార్షిక సమావేశాల్లో యూఎన్ వేదికపై ప్రసంగించారు.
Similar News
News October 31, 2024
వేద పండితులకు రూ.3,000.. ఉత్తర్వులు జారీ
AP: రాష్ట్రంలోని వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 600 మందికి సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల నుంచి సంభావన చెల్లించాలని పేర్కొంది. ఈ సాయం పొందే పండితులు వారి నివాసానికి సమీపంలోని ఆలయంలో రోజూ గంటపాటు వేద పారాయణం చేయాలంది.
News October 31, 2024
ఈ ఆలయం దీపావళి రోజు మాత్రమే తెరుస్తారు
కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఉన్న హసనాంబా ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవిగా పూజలందుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.
News October 31, 2024
మాజీ మంత్రి అప్పలరాజుకు తీవ్ర అస్వస్థత
AP: మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న పలాసలోని ఇంటి వద్ద వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.