News July 17, 2024

ఆధార్ లేనివారికి అలర్ట్

image

AP: ఆధార్ నమోదు కోసం ఈనెల 23 నుంచి 27 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 0-5 ఏళ్లలోపు వారికి కొత్త ఆధార్ నమోదుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1.36 కోట్ల మంది డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ప్రత్యేక శిబిరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

Similar News

News November 8, 2025

కీరాతో ఎన్నో లాభాలు

image

కీరా దోసకాయ అంటే తెలియని వారెవరూ ఉండరు. దీన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నోలాభాలుంటాయంటున్నారు నిపుణులు. *కీరా దోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. *C, K విటమిన్లు, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *పీచు అధికంగా ఉన్నందున జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. వ్యర్థాలను తొలగించి, పొట్ట, పేగులను శుభ్రపరుస్తుంది. * దీన్ని తినడం వల్ల గుండెఆరోగ్యంగా ఉంటుంది.

News November 8, 2025

జీరో టిల్లేజీలో మొక్కజొన్న సాగు – సూచనలు

image

జీరో టిల్లేజి పద్ధతిలో వరిచేను కోశాక దుక్కి దున్నకుండానే పదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. బరువైన, తేమను నిలుపుకొనే నేలలో మాత్రమే ఈ పద్ధతిని పాటించాలి. కోస్తా జిల్లాల్లో నవంబరు నుంచి జనవరి మొదటి వారం వరకు నాటవచ్చు. వరి కోత తర్వాత నేలలో తగినంత తేమ లేకపోతే ఒక తేలికపాటి తడిచ్చి పంట విత్తుకోవాలి. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. ఉండేట్లు విత్తాలి.

News November 8, 2025

60 ఏళ్ల వృద్ధుడు ₹1800 కోట్ల స్కామ్ వెలికితీత

image

MHలో Dy.CM అజిత్ పవార్ కుమారుడు పార్థ్ కంపెనీకి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం తీవ్రవివాదంగా మారింది. ₹1800CR విలువైన భూమిని ₹300CRకే కట్టబెట్టారు. ఈ స్కామ్‌పై ముందుగా దిన్‌కర్ కోట్కర్(60) IGR ఆఫీసుకు లేఖ రాసినా స్పందన రాలేదు. ఆ లేఖను తీసుకున్న ఓ సోషల్ యాక్టివిస్టు రికార్డులు టాంపర్ చేసినట్లు బయటపెట్టారు. అధికారుల విచారణలో అక్రమాలు నిజమని తేలడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది.