News July 17, 2024
ప్రజలందరికీ ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలు కలగాలి: చంద్రబాబు

AP: తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ప్రజలందరికీ ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అటు పవిత్ర మొహర్రం నేపథ్యంలో ముస్లిం సోదరసోదరీమణులకు శుభం జరగాలనే అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు. సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన ఇమామ్ హుస్సేన్ జీవితం ఆదర్శమని కొనియాడారు.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<