News July 17, 2024
సీ.ఎం.ఓ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా మార్కాపురం వాసి

మార్కాపురం పట్టణానికి చెందిన తంగిరాల యశ్వంత్ సీఎం కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన జమ్మలమడుగు డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ సమర్థవంతమైన అధికారిగా ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. ఈయన తల్లిదండ్రులు జగన్నాథం, శర్వాణి ఇద్దరూ ఉపాధ్యాయులు కావడం విశేషం.
Similar News
News November 10, 2025
ప్రకాశమంతా ఒకటే చర్చ.. ఆ ప్రకటన వచ్చేనా?

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మార్కాపురం జిల్లా ప్రకటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబు నేడు నిర్వహించనున్న క్యాబినెట్ సమావేశంలో జిల్లాల ఏర్పాటుపై తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం జిల్లాగా, శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురంలో విలీనం చేస్తారా? లేదా అన్నది కూడా తేలే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
News November 10, 2025
ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్.!

ప్రకాశంలో 11వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పీసీ పల్లిలోని పెదఇర్లపాడు వద్ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు పెదయిర్లపాడు హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. 10.35 నుంచి 12.15 వరకు పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.
News November 9, 2025
వెయ్యి మందికి రూ.9 కోట్ల సాయం: మంత్రి స్వామి

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి CMRF చెక్కులు పంపిణీ చేశారు. మర్రిపూడి మండలం పలువురికి మంజూరైన చెక్కులను ఆదివారం ఆయన అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గంలో దాదాపు వేయ్యి మందికి రూ.9కోట్ల వరకు సాయం చేశామని వెల్లడించారు.


