News July 17, 2024

6,250 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన తెలుగు యువకుడు

image

TG: మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన భూక్య యశ్వంత్ అరుదైన ఘనత సాధించారు. లద్దాక్‌లోని 6,250 మీటర్ల మౌంట్ కాంగ్ యాట్సే 2 పర్వతాన్ని ఎక్కారు. అందుకు 8 రోజుల పాటు శ్రమించినట్లు తెలిపారు. శిఖరాగ్రాన్ని చేరుకొని జెండాను ప్రదర్శించాక కష్టమంతా మరిచిపోయినట్లు పేర్కొన్నారు. పర్వతారోహణ అంటే తనకు ఇష్టమని, ఎవరెస్ట్ ఎక్కడమే తన లక్ష్యమని చెప్పారు.

Similar News

News April 7, 2026

BREAKING: పాకిస్థాన్‌లో లాక్‌డౌన్

image

తీవ్ర ఆర్థిక సంక్షోభం, యుద్ధం వల్ల ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ప్రభుత్వం ‘స్మార్ట్ లాక్‌డౌన్’ విధించింది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఇవాళ్టి నుంచి రా.8 గంటలకే షాపింగ్ మాల్స్, రా.10 గంటలకే బేకరీలు, రెస్టారెంట్లు, దాబాలు, ఫంక్షన్ హాళ్లు మూసివేయాలని పేర్కొంది. పంజాబ్, ఖైబర్ పంఖ్తుఖ్వా, బలూచిస్థాన్, ఇస్లామాబాద్, గిల్గిత్-బాల్టిస్థాన్, PoKలోని ప్రాంతాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.

News April 7, 2026

రేవంత్‌కు విజయన్ ఘాటు రిప్లై

image

TG CM రేవంత్ <<19584604>>వ్యాఖ్యలపై<<>> కేరళం CM విజయన్ ఘాటుగా స్పందించారు. ‘మన మధ్య పొలిటికల్ విభేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మీవన్నీ నిరాధార ఆరోపణలు. అతితక్కువ అవినీతి కలిగిన రాష్ట్రంగా కేరళంను నీతిఅయోగ్ గుర్తించింది. 2025 Nov 1న తీవ్ర కరవు జయించిన తొలి రాష్ట్రంగా నిలిచాం. BJPపై మాకేమీ ప్రేమ లేదు. ఆ పార్టీపై పోరాటానికి ఉమ్మడి వేదికగా నిలుస్తున్నాం’ అని సుదీర్ఘ లేఖ రాశారు.

News April 7, 2026

చావుకు మరో ఏడాది దగ్గరయ్యా: ఆర్జీవీ

image

నేడు తన పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇవాళ నేను చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను. కాబట్టి ఏవో కారణాల వల్ల సంతోషం కలిగితే తప్ప మనం సంబరాలు చేసుకోవద్దు. థాంక్స్’ అంటూ రాసుకొచ్చారు.