News July 17, 2024
టెస్టుల్లోకి రింకూ సింగ్?
టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ త్వరలోనే టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా రింకూ ఆటపై భారత మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘T20WC సమయంలో నెట్స్‌లో రింకూ బ్యాటింగ్ చూసినప్పుడు అతనిలో ఓ టెస్ట్ క్రికెటర్ ఉన్నాడనిపించింది. టెస్టు ఫార్మాట్ ఆడగలిగే సత్తా ఆయనకు ఉంది. త్వరలోనే రింకూ టెస్టుల్లో అరంగేట్రం చేస్తారు’ అని రాథోడ్ వ్యాఖ్యానించారు.
Similar News
News January 22, 2025
తెలంగాణలో మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులు
దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.10వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు MOU కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కానుండగా, 3600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగా కంట్రోల్ ఎస్ సంస్థ ఇప్పటికే HYDలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
News January 22, 2025
మహా కుంభమేళాకు వెళ్తున్నారా?
‘మహా కుంభమేళా’కు వెళ్లి వచ్చిన వారి అభిప్రాయాలు మీకోసం. ‘ట్రైన్‌లో వెళ్తే స్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు అరగంట పడుతుంది. టాక్సీలు దొరకవు. సిటీ అంతా ట్రాఫిక్. ఆన్‌లైన్ కంటే క్యాష్ తీసుకెళ్లండి. ఆన్‌లైన్‌లోనే టెంట్స్ బుక్ చేసుకోవచ్చు. రూ.5వేలు చెల్లిస్తే బోట్‌లో వెళ్లి స్నానం చేసి రావొచ్చు. నాగ సాధువుల ఆశీర్వాదం కోసం సగం రోజు కేటాయించండి’ అని సూచించారు. అధికారిక కాటేజీల నంబర్లను పై ఫొటోలో చూడొచ్చు.
News January 22, 2025
కర్ణాటక ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి
కర్ణాటకలో జరిగిన <<15220489>>రోడ్డు ప్రమాదంలో <<>>ఏపీ వాసులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని Xలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.