News July 17, 2024

‘బలగం’ మూవీని అవార్డులు వరిస్తాయా?

image

చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్‌గా నిలిచిన ‘బలగం’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఎన్నో అవార్డులను మూటగట్టుకున్న ‘బలగం’ తాజాగా ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డులు -2024లో 8 కేటగిరీల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ మేల్ & ఫీమేల్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ & ఫీమేల్ కేటగిరీల్లో ‘బలగం’ పోటీపడుతోంది.

Similar News

News December 27, 2025

NZB: నేడే ఆఖరు తేదీ.. అప్లై చేశారా!

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో B.Ed, B.P.Ed 1,3 వ సెమిస్టర్ల రెగ్యులర్ విద్యనభ్యసించే విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు తేదీయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు ఫీజు చెల్లించాలని విద్యార్థులు త్వరగా తమ కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అపరాధ రుసుముతో ఈ నెల 29వరకు చేసుకోవచ్చన్నారు.వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలన్నారు.

News December 27, 2025

10 రోజుల్లో ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం: TTD EO

image

AP: వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులు ఆందోళన చెందవద్దని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని, ఆ పవిత్ర రోజుల్లో ఏ రోజు స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని పండితులు చెప్పారని పేర్కొన్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించామని వివరించారు.

News December 27, 2025

గర్భనిరోధక మాత్రలు వాడితే పీరియడ్స్ ఆలస్యం అవుతాయా?

image

గర్భనిరోధక మాత్రల్లో వివిధ రకాల హార్మోన్‌లు, రసాయనాలు ఉంటాయి. ఇవి నేరుగా మీ జీవవ్యవస్థపై పని చేసి మీ ఋతు చక్రంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. కొందరు స్త్రీలలో తేలికపాటి రక్తస్రావం అవుతుంది. ఈ పిల్స్‌ ప్రభావం వల్ల మరి కొంతమంది పీరియడ్స్‌ కొంతకాలం పాటు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా వీటిని ఎక్కువగా వాడితే అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.