News July 17, 2024
ముచ్చుమర్రి ఘటన.. CI, SIపై వేటు

AP: ముచ్చుమర్రి ఘటనకు సంబంధించి స్థానిక సీఐ, ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. నందికొట్కూరు రూరల్ సీఐ విజయ్ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే వారిపై వేటు వేసినట్లు డీఐజీ తెలిపారు. కాగా ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అత్యాచారం, హత్య చేసి మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశారు.
Similar News
News January 12, 2026
18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు: CM

TG: తాను రెండేళ్ల పాలనలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సెలవు తీసుకోవాలని ముందురోజు అనుకుంటా. కానీ ఏదో ఒక పని ఉంటుంది. సీఎం పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ఇప్పుడు బాధ్యతలు మరింత పెరిగాయి. రోజుకు 18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు. ఇది బరువుగా చూడట్లేదు. బాధ్యతగా చూస్తున్నా’ అని ఉద్యోగులతో సమావేశంలో పేర్కొన్నారు.
News January 12, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు CM సంక్రాంతి కానుక

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. అటు ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
News January 12, 2026
BANలో హిందూ సింగర్ మృతి.. జైలు అధికారులపై ఆరోపణలు

బంగ్లాదేశ్‌లో హిందూ సింగర్, అవామీ లీగ్ నేత ప్రోలోయ్ చాకీ(60) కన్నుమూశారు. 2024లో జరిగిన ఓ పేలుడు కేసులో ఆయన్ను గత నెల 16న పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు కస్టడీలో ఉన్న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి తరలించగా నిన్న రాత్రి చనిపోయారు. అయితే చికిత్స అందించడంలో జైలు అధికారులు ఆలస్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.


