News July 17, 2024
ఎల్లుండి ఢిల్లీకి పవన్ కళ్యాణ్

AP: ఈ నెల 19న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ రోజు అక్కడ జరిగే జలజీవన్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి హోదాలో పవన్ హాజరుకానున్నారు. కాగా తొలిసారి కేంద్ర మంత్రితో సమీక్షకు హాజరుకానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
Similar News
News February 7, 2026
ఆదిత్య హృదయంలో ఏం ఉంటుంది? ఎందుకు చదవాలి?

రామాయణంలో అగస్త్య మహర్షి రాముడికి ఉపదేశించిన స్తోత్రం ఆదిత్య హృదయం. దీన్ని ఆదివారం నాడు చదవడం ఫలప్రదం. ఇందులో 30 శ్లోకాలుంటాయి. మొదటి 14 శ్లోకాలు సూర్యుని ప్రశస్తిని, 15-21 ప్రార్థనను, 22-27 శుభ ఫలితాలను వివరిస్తాయి. ఈ స్తోత్ర పఠనంతో శత్రువులపై విజయం, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం, దారిద్ర్య విముక్తి లభిస్తాయి. మనశ్శాంతితో పాటు కోరిన కోరికలు నెరవేర్చే శక్తివంతమైన కవచంలా ఇది భక్తులను రక్షిస్తుంది.
News February 7, 2026
పేరెంటింగ్ పద్ధతి మారాలి

ప్రపంచం వేగంగా మారుతోంది. దానికి తగ్గట్లే పేరెంటింగ్ కూడా మారాలంటున్నారు సైకాలజిస్టులు. పిల్లల ప్రవర్తన మనకు కొత్తగా ఉండొచ్చు కానీ అది తప్పు కాదు. పాత తరానికి కొత్త తరానికి మధ్య ఉన్న గ్యాప్ అది. దాన్ని భర్తీ చేయడానికి, పిల్లలతో కనెక్ట్ కావడానికి పేరెంట్స్ ప్రయత్నించాలని చెబుతున్నారు. వారి ఫ్రీక్వెన్సీకి తగ్గట్లు ట్యూన్ అవ్వడానికి పేరెంట్స్ ప్రయత్నిస్తేనే వారిని అర్థం చేసుకోవడం వీలవుతుందంటున్నారు.
News February 7, 2026
ఇకపై విద్యార్థుల ఖాతాల్లోనే డబ్బు జమ

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ కింద ఇప్పటివరకు ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లోకి నిధులు జమ చేసేది. ఇకపై పోస్టుమెట్రిక్ చదువుతున్న SC విద్యార్థుల ఖాతాల్లోనే డబ్బు జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర వాటా ₹300Cr, రాష్ట్ర వాటా ₹200Crను స్టేట్ నోడల్ ఖాతాలో జమ చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే చెల్లింపులు చేస్తారు. త్వరలో ST విద్యార్థులకూ ఇలాగే జమ చేస్తారు.


