News July 17, 2024
భూ పరిభ్రమణ వేగం నెమ్మదిస్తోంది!

పర్యావరణ మార్పుల కారణంగా భూమి కూడా భారీ మార్పులకు లోనవుతోందని స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు తెలిపారు. వారి అధ్యయనం ప్రకారం.. ధ్రువాల వద్ద కరిగిపోతోన్న మంచు భూమధ్య రేఖ దిశగా వెళ్తోంది. తదనుగుణంగా భూమి బరువు కూడా షిఫ్ట్ అవుతోంది. ఫలితంగా పరిభ్రమణ వేగం నెమ్మదించి ‘రోజు’ వ్యవధి పెరుగుతోంది. మనిషి మనుగడపై దీర్ఘకాలంలో ఇది ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు హెచ్చరించారు.
Similar News
News March 31, 2026
యుద్ధం.. భారీగా పెరగనున్న ధరలు

పశ్చిమాసియా యుద్ధం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపించనుంది. AP, TGలో సిమెంట్ బస్తా ధర రూ.50 పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. వారంలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో బస్తా రూ.280-320 మధ్య ఉండగా పెంపు తర్వాత రూ.320-370కి చేరనుంది. సిమెంట్ కంపెనీలు వాడే పెట్రోలియం కోక్ 130 డాలర్ల నుంచి 165కు చేరడం, ఇండస్ట్రియల్ డీజిల్ రేట్ రూ.23.75 పెంచడం ధరల పెరుగుదలకు కారణం.
News March 31, 2026
ఎలాంటి భోజనం తృప్తినిస్తుంది?

గంగిగోవు పాలు గరిటెడైనా చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గాడిద పాలు కడవ నిండా ఉన్నా గరిటెడు ఆవు పాలతో సమానం కాదు. అలాగే ప్రేమ, భక్తితో పెట్టిన కొద్ది భోజనమైనా ఎంతో తృప్తిని ఇస్తుందని అర్థం.
<<-se>>#PADHYAM<<>>
News March 31, 2026
భారత్ తొలి మహిళా డాక్టర్.. ఎందరికో స్ఫూర్తి!

పాశ్చాత్య వైద్యశాస్త్రంలో పట్టాపొందిన తొలి భారతీయ మహిళ డాక్టర్.ఆనందీబాయి జోషి. 1865 MAR 31న మహారాష్ట్రలో జన్మించిన ఈమెకు తొమ్మిదేళ్లకే వివాహమైంది. 14ఏళ్ల వయసులో కొడుకు పుట్టగా సరైన వైద్య సౌకర్యాలు లేక పది రోజులకే చనిపోయాడు. మహిళా డాక్టర్ల అవసరాన్ని గ్రహించిన ఆమె మెడిసిన్ చదివేందుకు సిద్ధపడ్డారు. భర్త ప్రోత్సాహంతో సమాజాన్ని ఎదిరించి అమెరికా వెళ్లారు. 1886లో పట్టా పొంది భారత్ తిరిగొచ్చారు.


